
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు రాజీనామా లేఖను అందించారు. వెంటనే ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకున్నాను. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి సేవ చేస్తాను. కేసీఆర్ నుంచి పిలుపు వచ్చాక టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌కు అత్యంత విధేయుడైన వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్యే లేదా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వెంకట్రామిరెడ్డి న్యాయవాదిగా పనిచేశారు. 1996 లో గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ తీసుకున్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




