
ఎన్‌టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న పుస్తక ప్రదర్శనను సందర్శించే వారికి టి.24 టికెట్‌పై 20 శాతం రాయితీ ఇస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టి24 టికెట్ కొనుగోలు నుంచి 24 గంటల పాటు సిటీ సర్వీస్‌లలో (డీలక్స్ బస్సుల వరకు) ఎన్ని సార్లైనా ప్రయాణించడానికి నగర ప్రయాణీకులకు ఓ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. వాస్తవానికి టి24 టికెట్ .ధర రూ.100, అయితే బుక్ ఫెయిర్‌ను సందర్శించే ప్రయాణీకులకు టిఎస్‌ఆర్‌టిసి కేవలం 80 రూపాయలకే అందజేస్తోంది. ముందు రోజు ఏ సమయానికి ఈ టిక్కెట్ కొనుగోలు చేస్తారో.. మరుసటి రోజు అదే సమయం వరకు దీనిని వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు.ఏటా 300కు పైగా బుక్ స్టాల్స్ ఫెయిర్ లో ఉండేవి. కానీ ఈ ఏడాది మాత్రం 250 స్టాల్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ.. ..మాస్కులు ధరించిన వాళ్ళను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.




