
తెలంగాణలో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో 16,027 కానిస్టేబుల్ ఉద్యోగాలు కాగా, మిగతా 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మే నెల 2 నుంచి 20 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితిని మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
RELATED ARTICLES
LEAVE A COMMENT




