
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్లో 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణులయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రద్దయిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3, 2021 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి https://tsbie.cgg.gov.in వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.మార్కుల మెమోలను 17వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఏ గ్రేడ్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య 1,15,538, బీ గ్రేడ్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య 66,351, సీ గ్రేడ్లో 27,752 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు.




