
బుద్ధ పౌర్ణిమ సందర్భంగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశానికి పయనమయ్యారు. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని కుశినగర్ కు ఆయన బయల్దేరారు. తన పర్యటన గురించి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ నేపాలీ ప్రధాని షేర్ బహదూర్‌తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. ప్రార్థనలను నిర్వహించిన తర్వాత ఆయన నేపాల్ లోని లుంబినీకి వెళ్తారు. ఇరు దేశాల ప్రజల మధ్య కూడా సుహృద్భావం సంబంధాలున్నాయని మోదీ పేర్కొన్నారు. బుద్ధుడి బోధనలు ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచుతాయని చెప్పారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




