
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన బూత్‌లో ఆయన ఓటేశారు. ఈ ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల(రాజ్యసభ, లోక్ సభ) సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉపరాష్ట్రపతి పదవి కోసం అధికార ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా .780 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. దీంట్లో 543 మంది లోక్‌సభ, 245 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, రాజ్ నాథ్ సింగ్, పియూష్ గోయల్, అమిత్ షా తదితర ప్రముఖులందరూ తమ ఓటును వినియోగించుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




