
హైదరాబాద్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా 50 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరంతా వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలో అక్రమంగా ఉంటున్నారని చెప్పారు. ఆఫ్రికా, సోమాలియా, కాంగో, నైజీరియా, యుగాండా దేశస్తులు చాలా మంది వీసా గడువు ముగిసిన ఇక్కడి నుంచి వెళ్లడం లేదు. దీంతో పోలీసులు వీరిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కార్డెన్‌సెర్చ్ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




