కృష్ణా జలాల్లో తెలంగాణకు యాభై శాతం వాటా ఇవ్వాల్సిందేనని తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ డిమాండ్ చేశారు.అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కృష్ణా జలాల వాటాపై ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.లంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం ప్రశ్నిస్తామన్నారు. నీటి అవసరాలు తీరాలంటే విద్యుదుత్పత్తి అత్యంత ఆవశ్యకమని రజత్ కుమార్ అన్నారు. కృష్ణా బేసిన్ నుంచి ఏపీ తరలిస్తున్న నీటిపై […]
READ MOREరాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం కోవిడ్ రూల్స్ పాటిస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్న సబిత.. గ్రామపంచాయతీ, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పక్కాగా శానిటేషన్ చేపడుతున్నామన్నారు. ధైర్యంగా పిల్లల్ని స్కూళ్లకు పంపొచ్చని భరోసా ఇచ్చారు.బుధవారం హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. స్కూళ్లల్లో పారిశుధ్యం […]
READ MOREదళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తోంది.ఈ క్రమంలో రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.దీని కోసం 1. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని […]
READ MOREసెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ సర్కారీ బడులు తెరవాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేయగా.. హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులపై ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకంగా ఎలాంటి హామీలు తీసుకోరాదని చెప్పింది. ప్రత్యక్ష తరగతులపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకూడదని ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. ఆన్ లైన్ బోధనను కొనసాగించాలని ఆదేశించింది.సెప్టెంబర్ – […]
READ MOREఅద్భుత ఘట్టం ఆవిష్కృతం.. సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మంది ప్రమాణస్వీకారం
admin August 31, 2021 0 COMMENTSసుప్రీం కోర్టులో మంగళవారం ఉదయం అపూర్వ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒక్కరోజే తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ వీరితో ప్రమాణం చేయించారు. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సి.టి. రవికుమార్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ బేలా మాధుర్య త్రివేది, జస్టిస్ పమిడిగంథం శ్రీనరసింహలు ప్రమాణం చేశారు. ఒకేసారి తొమ్మిది […]
READ MOREరాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట వద్ద వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం సాయంత్రం వరదల్లో చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో తీయడానికి ప్రయత్నించారు. కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద తాకిడికి వాగులో చిక్కుకుపోయింది. ఒక టైర్ కిందికి దిగి ఆగిపోయింది. బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉండగా.. గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్ సీటు పక్కన ఉండే కిటికీలోంచి ప్రయాణికులను […]
READ MOREదళితబంధును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకానికి నిధులు వేగంగా విడుదల చేస్తోంది. హుజూరాబాద్‌లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఈ నిధులను బదిలీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ. 1,500 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం ఇవాళ విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది.పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే […]
READ MOREతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను బదిలీ చేసింది. సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.దాదాపు 3 ఏళ్లకు పైగా సైబరాబాద్ కమిషనర్‌గా సేవలు అందించిన సజ్జనార్. .కరోనా సమయంలో ప్లాస్మా డొనేషన్‌లో విశేష సేవలు అందించారు. సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ కమిషనర్‌గా 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ముత్యాల స్టీఫెన్ రవీంద్రను […]
READ MOREతెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్‌కు అర్హులుగా అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ […]
READ MOREసెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
admin August 24, 2021 0 COMMENTSరాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలనూ సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో సుమారు ఏడాదిన్నరగా మూగబోయిన బడి గంటలు మళ్లీ మోగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.30వ తేది లోపు స్కూళ్లను పరిశుభ్రంగా తయారు చేస్తామని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ, […]
READ MORE









