తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపనున్నారు. రెండు, మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. ధాన్యం కొనుగోలు, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు, విద్యుత్ కేటాయింపులు, రాష్ట్ర విభజన అంశాలపై ఈ పర్యటనలోకేంద్రంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. యాసంగి ధాన్యం ఎంత కొంటారో స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే సిఎం కెసిఆర్ పలుమార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మంత్రుల సమావేశంలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించిన విషయం విధితమే. […]
READ MOREభారత దేశంలో తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఇదే నెలలో జరిగే శీతాకాల సమావేశాల్లో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచినట్లు వెల్లడించారు. గ్రామీణ మౌళిక సదుపాయాల మార్కెట్‌ను బలోపేతం చేశామన్నారు. ఎంఎస్‌పీ పెంచామన్నారు. రికార్డు స్థాయిలో ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లను పెంచామన్నారు. తాము చేపట్టిన […]
READ MOREతెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతుల మహాధర్నాకు సంఘీభావంగా విచ్చేసిన పార్టీ ప్రజాప్రతినిధులందరికీ సీఎం కేసీఆర్ స్వాగతం తెలిపారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర జరుగుతున్న టీఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన సీఎం…ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఇక యుద్ధం ఆగబోదని అన్నారు.పంజాబ్‌లో వడ్లు కొన్న తీరుగానే తెలంగాణలోనూ కొనాలని తాము డిమాండ్ చేశామని, ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని ఢిల్లీకి పోయి అడిగినా కేంద్రం […]
READ MOREతెలంగాణ అమలు చేస్తున్న విధానాలతో వ్యవసాయ రంగం గణనీయ ప్రగతి సాధించిన సంగతి తెలిసిందేనని.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు ఏటా ఎకరాకు పదివేల రూపాయల పంటపెట్టుబడి సాయం అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. సాగునీటి లభ్యత పెరిగాక, ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా మారడంతోపాటు దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ మారిందని వివరించారు.ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్రానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈనెల […]
READ MOREఅత్యుత్తమ పర్యాటక గ్రామంగా ‘భూదాన్ పోచంపల్లి’ ఐక్యరాజ్యసమితి గుర్తింపు
admin November 16, 2021 0 COMMENTSతెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.రాష్ట్రంలోని పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక చేసింది. ఇదే విషయాన్ని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అధికారికంగా ప్రకటించింది. భారతదేశం నుంచి 3 గ్రామాలు పోటీ పడగా భూదాన్ పోచంపల్లి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైంది.ఈ అవార్డు కోసం భారత్ నుంచి మేఘాలయలోని […]
READ MOREవచ్చే ఏడాది టీ20 క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీ ఆస్ట్రేలియాలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీకి చెందిన ఏడు వేదికలను ఖరారు చేశారు. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ప్రపంచకప్ జరగనుంది. మొత్తం 45 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందుకు బ్రిస్బేన్, అడిలైడ్, గీలాంగ్, హోబార్ట్, పెర్త్, సిడ్నీ, మెల్బోర్న్ నగరాలను వేదికలుగా అధికారులు ప్రకటించారు. సిడ్నీ, అడిలైడ్‌లలో సెమీస్‌లు జరగనుండగా, నవంబర్ 13న మెల్‌బోర్న్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.టీ20 వరల్డ్‌కప్ కోసం 12 జట్లు […]
READ MOREఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్ పార్టీ ఖరారు చేసింది. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైనలైజ్ చేసిన 6గురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా కొద్ది సేపటి కిందటే విడుదలైంది. కడియం శ్రీహరి(వరంగల్),తక్కళ్లపల్లి రవీందర్ రావు (మహబూబా బాద్),గుత్తా సుఖేందర్ రెడ్డి (నల్లగొండ),పాడి కౌశిక్ రెడ్డి (కరీంనగర్),మాజీ కలెక్టర్ వెంకట్రాం రెడ్డి(సిద్ధిపేట)బండ ప్రకాష్ పేర్లు ఖరారయ్యాయి.అసెంబ్లీలో టీఆర్ఎస్ సంఖ్యా బలాన్ని బట్టి ఈ ఆరుగురూ ఎమ్మెల్సీలు దాదాపు ఏకగ్రీవంగానే ఎన్నిక కానున్నారు.ఖరారైన ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు […]
READ MOREసిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు రాజీనామా లేఖను అందించారు. వెంటనే ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకున్నాను. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి సేవ చేస్తాను. కేసీఆర్ నుంచి పిలుపు వచ్చాక టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌కు అత్యంత […]
READ MOREవస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని చేనేత, జౌళి, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీకి వెళ్లి వ్యక్తిగతంగా కలిసి ఈ విషయాన్ని గుర్తు చేసిన కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన చెప్పారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు ఆదివారం కేటీఆర్ మరోసారి లేఖరాశారు.సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. చేనేత, […]
READ MOREఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.నిలోఫర్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన 100 పడకల యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మీడియాతో మాట్లాడారు.కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.18 కోట్లు అందించామని చెప్పారు. రూ.10 వేల కోట్లు కేటాయించి ఆరోగ్యశాఖను అభివృద్ధి చేశామని మంత్రి వెల్లడించారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ఉన్న డెలివరీ రేట్.. కేసీఆర్ కిట్ వచ్చాక 50 […]
READ MORE










