
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.జులై 2022 లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని ప్రకటించారు. ఉద్యోగులకు డిఏ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ దృష్టికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇటీవలే తీసుకెళ్లగా కేసీఅర్ సానుకూలంగా స్పందించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




