
రాష్ట్ర హైకోర్టులో కొత్త జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో మొదటి కోర్టు హాల్లో మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. హైకోర్టు జడ్జిలుగా శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, వేణుగోపాల్, నగేష్, పి. కార్తీక్, కె. శరత్‌లు ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఏర్పాటైనప్పుడు జడ్జిల సంఖ్య 24 ఉండగా.. ఆ సంఖ్యను 42కు పెంచుతూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఎనిమిది జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
RELATED ARTICLES
LEAVE A COMMENT




