
మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్ అయ్యారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గత 4 రోజులుగా ఫోన్ స్విచ్ఛాప్ చేసి నారాయణ అజ్ఞాతంలో ఉన్నారు. నారాయణ స్కూల్స్ సిబ్బంది పాత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్‌లో వెలుగులోకి వచ్చింది ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన జరిగింది. నారాయణ విద్యాసంస్థలకు చెందిన గిరిధర్ అనే ఉద్యోగి లీకేజీలో పాత్ర వుందంటున్నారు. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత ఉదయం 9.57కి ప్రశ్నాపత్రం లీకైంది. ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన తర్వాత సీఐడీ దూకుడు పెంచింది. టీడీపీకి చెందిన మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
RELATED ARTICLES
LEAVE A COMMENT




