
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్ పార్టీ ఖరారు చేసింది. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైనలైజ్ చేసిన 6గురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా కొద్ది సేపటి కిందటే విడుదలైంది. కడియం శ్రీహరి(వరంగల్),తక్కళ్లపల్లి రవీందర్ రావు (మహబూబా బాద్),గుత్తా సుఖేందర్ రెడ్డి (నల్లగొండ),పాడి కౌశిక్ రెడ్డి (కరీంనగర్),మాజీ కలెక్టర్ వెంకట్రాం రెడ్డి(సిద్ధిపేట)బండ ప్రకాష్ పేర్లు ఖరారయ్యాయి.అసెంబ్లీలో టీఆర్ఎస్ సంఖ్యా బలాన్ని బట్టి ఈ ఆరుగురూ ఎమ్మెల్సీలు దాదాపు ఏకగ్రీవంగానే ఎన్నిక కానున్నారు.ఖరారైన ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




