
ట్రాన్స్‌జెండర్ జానపద నృత్యకారిణి మంజమ్మ జోగటి కళలకు ఆమె చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ట్రాన్స్‌జెండర్ అయినప్పటికి మిగతా వారికి భిన్నంగా జీవితాన్ని గడుపుతోంది. అయితే ఆ అవార్డు స్వీకరించేందుకు వెళ్లిన మంజమ్మ .. తనదైన రీతిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను దీవించింది. కర్నాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి ట్రాన్స్‌విమెన్‌గాను. మంజమ్మ జోగతి రికార్డులకెక్కారు .2021 ఏడాదికి గానూ మొత్తం 119 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ భూషణ్, 10 మందికి పద్మ విభూషణ్, 102 మందికి పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక చేయగా.. వారిలో ఓ ట్రాన్స్‌జెండర్ కూడా ఉండడం విశేషం. తన చీర కొంగుతో కోవింద్‌కు దిష్టి తీసి.. శుభం కలిగేలా దీవనెలు చేసింది. 2010లో కర్ణాటక ప్రభుత్వం మంజమ్మను వార్షిక కన్నడ రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. దేశంలో పద్మశ్రీ అందుకున్న(2019లో) తొలి ట్రాన్స్ జెండర్‌గా నిలిచారు. మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. యుక్త వయసులో తనను తాను స్త్రీగా గుర్తించిన తర్వాత మంజమ్మగా పేరు మార్చుకున్నారు.




