
గాల్వాన్ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కార ప్రదానం జరిగింది.రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ భార్య, తల్లి ఈ అవార్డును స్వీకరించారు. కాగా యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే రెండో అత్యున్నత పురస్కారమే మహావీర్ చక్ర. గతేడాది జూన్ లో తూర్పు లద్దాఖ్ గల్వాన్ వ్యాలీలో చైనా ఆర్మీ దాడిని ప్రతిఘటించిన ఘటనలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కల్నల్ సంతోష్ బాబుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. సంతోష్ బాబు వీర మరణంతో తెలంగాణ ప్రభుత్వం ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది. ఆమె ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




