
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకే ధృవతార అని కొనియాడారు. గొప్ప నటుడు, వితరణశీలి అని.. తన సినిమాలతో వచ్చే లాభాలను విపత్తు బాధిత ప్రజలను ఆదుకోడానికి వెచ్చించిన వదాన్యుడని అన్నారు. 350కిపైగా సినిమాల్లో నటించిన సినీ ప్రేక్షకుల్లో చెలగరని ముద్ర వేసిన సినీ పరిశ్రమ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా, నిర్మాణ సంస్థగా ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




