
రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లను సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా జూలూరి గౌరీశంకర్, తెలంగాణ స్టేట్ టెక్నాలాజికల్ సర్వీసెస్ చైర్మన్ గా జగన్ మోహన్ రావు, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దూదిమెట్ల బాలరాజు యాదవ్,తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా ఆకుల లలిత ,తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్ నియమితులయ్యారు. రానున్న మరికొన్ని రోజుల్లో ఇంకా పలు.. కార్పొరేషన్‌లకు నూతన చైర్మన్‌లను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.
RELATED ARTICLES
LEAVE A COMMENT




