
అన్ని ధరలు పెరిగి అల్లాడుతున్న సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. ఈ ఉదయాన్నే సామాన్య ప్రజలకు గుండె గుభేల్ మనిపించే చేదు వార్తను చమురు సంస్థలు వినిపించాయి. ఒక్కసారిగా రూ. 50 పెంచేశాయి చమురు సంస్థలు. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1052కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకునే రూ.30 కలిపితే రూ.1082 అవుతుంది. పెంచిన ధరలు నేటినుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. ఇక నెల గ్యాప్ తర్వాత ఇప్పుడు యాభై రూపాయలు పెంచాయి కంపెనీలు. డొమెస్టిక్ సిలిండర్‌లపై మార్చి 22న పెంపు ఇచ్చిన కంపెనీలు.. ఆ టైంలోనూ 50 రూ. పెంచాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,460 నుంచి రూ. 2,563.50కి చేరుకుంది. ఏకంగా రూ. 102 పెంచాయి కంపెనీలు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




