
దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పిడికిలెత్తిన ఉద్యమకారుడు.. నెల్సన్ మండేలా, అహ్మద్ కత్రాడా వంటి ఉద్ధండులతో కలిసి జైలు జీవితాన్ని గడిపిన భారత సంతతి వ్యక్తి ఇబ్రహీం ఇస్మాయిల్ ఇబ్రహీం (84) కన్నుమూశారు. ఇబ్రహీం మృతి పట్ల ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) సం తాపం ప్రకటించింది. దక్షిణాఫ్రికాలో భారతీయుల కదలికలపై విధించిన నిషేధాన్ని ధిక్కరించినందుకు తండ్రిని అరెస్టు చేయడంతో 13 ఏళ్ల వయసులోనే విముక్తి పోరాటంలో చేరి, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన భారత సంతతి యోధుడు.ఆయన తన జీవితంలో 18 సంవత్సరాలు జైలులోనే ఉన్నారు. ఖైదీగా ఉంటూనే రెండు యూనివర్సిటీ డిగ్రీలు సంపాదించారు. మహాత్మాగాంధీ సత్యాగ్రహ పోరాటం తనకు స్ఫూర్తినిచ్చిందని ఇస్మాయిల్ పలుమార్లు చెప్పారు. ఇబ్రహీంను దక్షిణాఫ్రికా ప్రజలు ముద్దుగా ‘కామ్రేడ్ ఎబీ’ అని పిలుస్తారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




