
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, జియాగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్, చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, హైటెక్‌సిటీ, నాంపల్లి, కోఠి, మలక్‌పేట్, చైతన్యపురి, అంబర్‌పేట్, ముసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తోంది. మూసీనదికి భారీగా వరదనీరు పోటెత్తడంతో మూసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. ఈ బ్రిడ్జిని మూసేయడం ఇది రెండోసారి.
RELATED ARTICLES
LEAVE A COMMENT



