
సద్గురు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ‘సేవ్ సాయిల్’ కార్యక్రమం ప్రశంసనీయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మానవ ప్రయత్నం హరితహారం అని చెప్పారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ సమావేశమయ్యారు.విష్యత్‌లో వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించిపోయే ప్రమాదం ఉన్నందున ఇప్పటి నుంచే భూమిని పంటలకు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను చేపట్టాలని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డాటా సైన్సెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు వినియోగంపై ప్రభుత్వ విభాగాలకు ఉండాల్సిన నియంత్రణ అధికారాలను స్పష్టంగా నిర్దేశించినప్పుడే ఇది సాధ్యం అవుతుందన్నారు మంత్రి కేటీఆర్.
RELATED ARTICLES
LEAVE A COMMENT




