
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నెల 18న సోమవారం పునఃప్రారంభం కానున్నాయి. మొత్తంగా వర్షాల కారణంగా ఈ వారం మొత్తం పాఠశాలలు తెరచుకోలేదు. బుధవారం నుంచి కూడా మరో మూడు రోజుల పాటు తెలంగాణలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
RELATED ARTICLES
LEAVE A COMMENT




