
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఇవాళ రాజ్యాంగ దినోత్సవ సంబరాలను నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఆ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి మోడీ నివాళులర్పించారు. 2008లో ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి వందలాది మంది అమాయక పౌరులను హతమార్చిన ఈరోజు 26/11 కూడా మనకు చాలా బాధాకరమైన రోజు అని ఆయన అన్నారు. విభిన్నమైన మన దేశాన్ని.. మన రాజ్యాంగం ఏకీకృతం చేస్తుందని అన్నారు. ఎన్నో అవరోధాల తర్వాత రాజ్యాంగాన్ని రచించినట్లు ఆయన తెలిపారు. స్వతంత్య్రంగా ఉన్న రాష్ట్రాలను మన రాజ్యాంగం ఏకంగా చేసిందని ప్రధాని మోదీ అన్నారు. డీఎంకే, శివసేన, ఆర్ఎస్పీ, ఎన్సీపీ, ఎస్పీ, టీఎంసీతోపాటు సీపీఎం, సీపీఐ(ఎం), ఆర్జేడీ, జేఎంఎం, ఐయూఎంఎల్ పార్టీలు రాజ్యాంగ దినోత్సవ వేడుకను బహిష్కరించాయి.




