
కేంద్రం ధాన్యాన్ని తీసుకొంటేనే రాష్ట్రం సేకరణ మొదలుపెడుతుందని, రాష్ర్టానికి కొని, నిల్వ చేసే శక్తి ఉండదని స్పష్టంచేశారు. సోమవారం క్యాబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో మీడియాతో .. ఆహార భద్రత కల్పించడం చట్ట ప్రకారం కేంద్రానిదే బాధ్యత అని, దశాబ్దాలుగా ఇది జరుగుతున్నదేనని స్పష్టం చేశారు. రైతు ఉద్యమంలో మరణించిన 750 మందికి కేంద్రం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని వెంటనే తేవాలని డిమాండ్ చేస్తాం. యాసంగిలో బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రం కరాఖండిగా చెప్పినందున వచ్చే సీజన్‌లో రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. విధిలేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా సైంటిఫిక్‌గా గోదామాలు లేవన్నారు. ఆ టెక్నాలిజీ కేవలం ఎఫ్‌సిఐ వద్దనే ఉందన్నారు. రాష్ట్రంలో ధాన్యాన్ని కోనుగోలు చేయాలని కేంద్రం చుట్టూ పదిహేను సార్లు అధికారులు…ఆరు సార్లు మంత్రులు వెళ్ళారన్నారు. అయినా కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదని ఆయన మండిపడ్డారు.న్యం నిల్వ చేయడంలో సమస్యలుంటే ప్రత్యామ్నాయం ఆలోచించే శక్తి కేంద్రానికి ఉంటుంది. కాబట్టి అవసరమైతే లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చినా భరించాలి. కానీ కేంద్రం బాధ్యత నుంచి తప్పుకుని రాష్ట్రాలపై నెపాన్ని నెట్టడం దిక్కుమాలినతనం, దరిద్రపు గొట్టు ప్రయత్నం. ఇంత నీచంగా, దిగజారి పచ్చి అబద్ధాలు చెప్తూ రైతులను అయోమయానికి గురి చేస్తున్న కేంద్రాన్ని ఎప్పుడూ చూడలేదు. గతంలో తెలంగాణ నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మాత్రమే జరిగిందని చెప్పిన ఆయన…. తమ హయాంలో 69.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతోందని స్పష్టం చేశారు.




