
75వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం(అగస్ట్16న) సామూహికంగా జాతీయ గీతాలాపన కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 11గం.30ని. ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా అందరూ జనగణమన ఆలపించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. అబిడ్స్ జీపీవో నెహ్రూ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ ప్రముఖలు, అధికారులు పాల్గొన్నారు. అన్ని ప్రధాన కూడళ్లల్లో రెడ్ సిగ్నల్స్‌ను వేసి.. నిమిషం పాటు ట్రాఫిక్‌ను నిలిపివేసి.. స్వచ్చందంగా ప్రజలు సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. అన్ని మెట్రో రైళ్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సులు, వాహనాలు, ప్రజానీకం ఒక్కసారిగా నిమిషం పాటు నిలిచిపోయింది.
RELATED ARTICLES
LEAVE A COMMENT




