
రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌లు సైతం ఓటు వేశారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు. ఓటింగ్ అనంతరం సీఎం కేసీఆర్ ఎస్సారెస్సీ పరిశీలనకు వెళ్లనున్నారు. ఆయన నిన్నటివరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద పరిస్థితులను పరిశీలించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




