
తెలంగాణ కేబినెట్ రేపు(మంగళవారం) అత్యవసరంగా సమావేశంకానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు.ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ చేపట్టిన దీక్షలో ధాన్యం కొనుగోలు ప్రభుత్వమే చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై ఓ నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




