
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. కల్యాణ మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




