
కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది సేపటి క్రితం రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్ చేసింది. జూన్ 15 నుంచి నామినేషన్ల స్వీకరణ ,ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, 30న నామినేషన్ల పరిశీలనుంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు . రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోనుంది. ఇక, ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. నామినేటెడ్ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేదు. కాగా, పార్లమెంట్ ప్రాంగణం, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది.
RELATED ARTICLES
LEAVE A COMMENT




