
టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం మాదాపూర్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ”టీఆర్ఎస్ పార్టీ ఒక వ్యక్తిదో, శక్తిదో కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణకు టీఆర్ఎస్ ఒక రక్షణ కవచం అన్నారు. తెలంగాణ ప్రజల కాపలాదారు టీఆర్ఎస్ పార్టీ అని, దేశంలో 10 ఉత్తమైన గ్రామాల్లో అన్ని తెలంగాణ పల్లెలే ఉన్నాయన్నారు. దేశంలో 20 ఉత్తమ గ్రామాల్లో కూడా 19 తెలంగాణవే ఉన్నాయని తెలిపారు. దేశంలో కరెంట్కోతలు కొనసాగుతుంటే.. తెలంగాణ మాత్రం వెలుగు జిలుగులని గర్వంగా చెప్తున్నా. తాగునీరు, కరెంట్ అందలేని పరిస్థితులు.ధరణి ద్వారా రైతులు, భూ యాజమాన్య సమస్య తీరిందని తెలిపారు. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నామన్నారు. నూతన వ్యవసాయ విధానం, నూతన ఆర్థిక విధానం, నూతన పారిశ్రామిక విధానం రావాలి. అందుకు అవసరమైన వేదికలు తయారు కావాలి. ఆ భారతదేశం లక్ష్యంగా పురోగమించాలి.అంతేకానీ, సంకుచిత రాజకీయం కాదన్నారు సీఎం కేసీఆర్.




