
శ్రీమతి అల్లం పద్మ మరణం పట్ల టిఆర్సి ఛైర్మన్ తీవ్ర సంతాపం…
శ్రీమతి అల్లం పద్మ(తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీ.అల్లం నారాయణ భార్య) మరణం పట్ల తీవ్ర సంతాపం తెలుపుతున్నాము. ఆమె హైదరాబాద్ మహిళలకు ముఖ్యంగా తెలంగాణ మహిళా విద్యార్థులు మరియు యువతకు అందించిన సేవలకు “అమ్మ”గా ప్రసిద్ధి చెందింది. మహిళా జెఎసి సభ్యురాలిగా మహిళా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని క్రియాశీలక పాత్ర పోషించిన వారిలో శ్రీ. అల్లo పద్మ ఒకరు.
తెలంగాణ ఉద్యమం సమయం లో ఓయు హాస్టళ్లు, మెస్సులు మూసివేసినప్పుడు అమ్మ అల్లాం పద్మ విద్యార్థుల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చారు. వారి సంక్షేమం కోసం ఆమె చేసిన కృషిని విద్యార్థులు జెఎసి వారి జీవితంలో ఎన్నడూ మరచిపోరు. ఆమె “అమ్మ సంఘం” అధ్యక్షురాలిగా చివరివరకు కొనసాగింది.
వేదకుమార్ మణికొండ,
ఛైర్మన్,
తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టిఆర్ సి),
ఆమె మరణానికి చింతిస్తూ ఆమెకు నివాళులు అర్పిస్తూ, బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె సేవలు ఎల్లప్పుడూ కీర్తించబడతాయి మరియు తెలంగాణ ప్రజల హృదయాలలో కలకాలం నిలిచి ఉంటాయి.
……..
వేదకుమార్ మణికొండ
9848044713





