
మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జెఎసిలో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు గా కొనసాగిన అల్లం పద్మ(55) అస్వస్థతతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉస్మానియాలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో మెస్ లు కూడా మూసేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన సమైక్య పాలకులకు ఆ విద్యార్థుల ఆకలి తీర్చి ధీటైన సమాధానం చెప్పి ఎందరో విద్యార్థులకు ఆకలి తీర్చిన అమ్మ అయ్యి అమ్మ ల సంఘం అధ్యక్షురాలిగా నేటికీ కొనసాగుతూ వచ్చింది. ఉద్యమంలో తెలంగాణ మహిళ జేఏసీ నాయకురాలిగా నిరాహార దీక్షలు, ధర్నాలు చేసి ఉద్యమకారుల ముందు నిలిచారు. ఆంధ్ర మహిళా సభలో టీచర్ ట్రైనింగ్ చేసిన పద్మ కొంతకాలం టీచర్ గా పనిచేశారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




