
దేశంలోని అగ్రగామి 10 విద్యా సంస్థల వివరాలను ‘అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్ మెంట్స్’ తాజాగా విడుదల చేసింది. ఐఐటీ మద్రాస్ టాప్ ర్యాంక్ ను సొంతం చేసుకుంది. ఐఐటీ మద్రాస్ వరుసగా మొదటి స్థానం దక్కించుకోవడం ఇది మూడోసారి . ఐఐటీ బోంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూర్కీ ,ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ఖరగ్పూర్ నిలిచాయి.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- హైదరాబాద్ ఏడో స్థానంలో నిలిచింది. దేశంలోని వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లోని అధ్యాపకులు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ 2018లో ఏఆర్ఐఐఏ పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఏటా ర్యాంకులను ప్రకటిస్తున్నది.
RELATED ARTICLES
LEAVE A COMMENT




