“హర హర మహదేవ్” కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించిన: ప్రధాని మోదీ
admin December 13, 2021 0 COMMENTS
మోడీ కాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు. దీంతో ప్రధాని వెళ్లే దారంతా గులాబీ పూలతో నిండిపోయింది. అయితే మోడీ కాన్వాయ్ వస్తుండగా ఓ వ్యక్తి ఆయనకు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. కాషాయి వస్త్రాల్లో వచ్చిన వ్యక్తి తెచ్చిన కానుకను మోదీ కారు డోర్ ఓపెన్ చేసి స్వీకరించారు. అది గమనించిన ప్రధాని మోదీ.. భద్రతా సిబ్బందికి సర్దిచెప్పి.. ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచారు. అతని నుంచి తలపాగా, శాలువా స్వీకరించి ధన్యవాదాలు తెలిపారు. అక్కడ ఉన్న ప్రజలకు మోడీ అభివాదం చేశారు. సోమవారం ఉదయం కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జల మార్గం గుండా లలిత ఘాట్‌కు చేరుకుని గంగానదిలో ప్రధాని మోడీ పవిత్ర స్నానం చేశారు. సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా 3,000 మంది మత, ఆధ్యాత్మిక గురువులు, పూజారులు, ఇతర ప్రముఖుల సమక్షంలో మోదీ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌ను ప్రారంభించారు.1669లో అహల్యాబాయి హోల్కర్ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించగా, దాదాపు 350 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ విస్తరణ, పునరుద్ధరణ కోసం 2019 మార్చి 8న ఆలయ కారిడార్‌కు శంకుస్థాపన చేసిన విషయం తెలసిందే. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రతిష్ఠాత్మక ‘కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు’తో నవ చరిత్ర సృష్టి జరుగనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.భారతీయ సనాతన సంప్రదాయాలకు ప్రతీక వారణాసి అన్నారు. భారత్‌లో భక్తిని ఢీకొనే శక్తి దేనికీ లేదన్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కారిడార్‌ను 50 వేల చదరపు మీటర్లలో నిర్మించారు.




