
తెలుగు అకాడమీ నిధుల స్కాం కేసులో 10 మందిని అరెస్ట్ చేసినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.రూ.64.50 కోట్ల వరకు నిధుల గోల్‌మాల్ జరిగిందని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు విడతలుగా నిధులను డ్రా చేశారన్నారు. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్, చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన, రియల్ ఎస్టేట్ వ్యాపారి సాయికుమార్‌లను అరెస్ట్ చేసినట్టు సీపీ వెల్లడించారు.యూబీఐ కార్వాన్ శాఖ నుంచి రూ.26కోట్లు, యూబీఐ సంతోష్‌నగర్ శాఖ నుంచి రూ.11కోట్లు, చందానగర్ కెనరా బ్యాంక్‌లో రూ.6కోట్లు ఎఫ్‌డీలు స్వాహా చేసినట్లు గుర్తించామని సీపీ చెప్పారు.నిధుల గోల్‌మాల్ విషయంలో సాయికుమార్ ప్రమేయం కీలకంగా ఉందన్నారు. సాయికుమార్‌పై మూడు కేసులు ఉన్నట్టు విచారణలో తేలిందన్నారు.రూ.25 కోట్ల మోసం కేసులో సాయికుమార్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారని సీపీ వెల్లడించారు.




