తెలంగాణ హైకోర్టుకు సతీశ్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టుకు ప్రశాంత్ కుమార్ మిశ్రా
admin September 17, 2021 0 COMMENTS
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్రశర్మ పేరును సుప్రీం కోర్టు కోలీజియం సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కర్ణాటక యాక్టింగ్ సీజేగా పని చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకమయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా వ్యవహరించిన ఏకే గోస్వామి ఛత్తీస్ గఢ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు సీజేగా పని చేసిన జస్టిస్ హిమాకోహ్లి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. ప్రస్తుతం తాత్కాలిక సీజేగా రామచంద్రరావు కొనసాగుతున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సిఫారసు చేసింది. ఆగష్టు 31న సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయడం చరిత్రలో అదే తొలిసారి. జడ్జీల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా సీజేఐ నిర్ణయించడంతో ఇది మరో చరిత్రగా నిలిచింది.




