
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభోత్సవం నేడు జరిగింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ,ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, తెలంగాణ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్‌లో మొదటి ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం కల్పించినందుకు గాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు ధన్యవాదాలు. సింగపూర్, దుబాయ్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్‌లను చూసి భారత్‌లో ఇది ఉండాలని మీరు స్పందించినందుకు ధన్యవాదాలు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




