
ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో జనరల్‌లో 48,816 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 1,02,236 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు.వొకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 65.07గా నమోదైంది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఎంసెట్ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. ఇంటర్ బోర్డు అధికారులు ఎంసెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఫలితాలు విడుదల చేశారు.



