
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో జరిగిన 73వ బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌కు (IPS probationers passing out parade) దోవల్ ముఖ్య అతిథిగా హాజయర్యారు. ఈ బ్యాచ్‌లో 149 మంది ప్రొబేషనరీలు బేసిక్ కోర్సు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో తెలంగాణ కేడర్‌కు నలుగురు, ఏపీ కేడర్‌కు ఐదుగురిని కేటాయించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఎనిమిది మంది ప్రొబేషనరీలకు అజిత్ దోవల్ ట్రోఫీలు అందజేశారు.దేశ భద్రతలో పోలీస్ సర్వీస్ వెన్నెముక లాంటిదని అజిత్ దోవల్ అన్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఐపీఎస్‌లకు ఆ ట్యాగ్ లైన్ ఉంటుందన్నారు. 52 సంవత్సరాల క్రితం తాను కూడా ఇదే అకాడమీ నుంచి ఐపీఎస్‌గా వచ్చానని ఆయన చెప్పారు.ఇప్పటివరకు ఎస్‌వీపీఎన్‌ఏలో 5700 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారని వెల్లడించారు. ఎంతోమంది ఐపీఎస్‌లు దేశానికి గర్వకారణంగా నిలిచారని చెప్పారు. భారతదేశపు 32 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం బాధ్యత కూడా పోలీసులదే. ఈ దేశపు చివరి అడుగు వరకూ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటుంది.




