
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను బదిలీ చేసింది. సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.దాదాపు 3 ఏళ్లకు పైగా సైబరాబాద్ కమిషనర్‌గా సేవలు అందించిన సజ్జనార్. .కరోనా సమయంలో ప్లాస్మా డొనేషన్‌లో విశేష సేవలు అందించారు. సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ కమిషనర్‌గా 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ముత్యాల స్టీఫెన్ రవీంద్రను నియమిస్తున్నట్లు ఆ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం వెస్ట్ జోన్ ఐజీపీగా బాధ్యతలు చేపడుతున్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




