
ఇండిపెండెన్స్ డే సందర్భంగా పోలీసు పతకాలను కేంద్రహోంశాఖ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాలకు చెందిన 1380 మంది పోలీసులకు పతకాలు అందిస్తారు.ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు పతకాలు ( PPMG ) ప్రకటించగా, 628 మంది గ్యాలంటరీ పోలీసు పతకాలు ప్రకటించారు. 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు, 662 మందికి విశిష్ట సేవా పతకాలను అందించనున్నారు. తెలంగాణకు చెందిన 14 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలను అందిస్తారు. ఏపీకి చెందిన 11 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు ఇస్తున్నట్లు కేంద్రహోంశాఖ ప్రకటించింది.తెలంగాణకు చెందిన అడిషనల్ డీజీపీ, వుమెన్ సెఫ్టీవింగ్ ఇంచార్జి స్వాతి లక్రా, జనగామ వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకాలు దక్కాయి. వీటిని ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ అందజేయనున్నారు.




