Monday, 23 November 2026
న్యూస్ · May 17, 2022 · admin

ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డు దరఖాస్తుల ప్రాసెస్

 గ్రీన్ కార్డు లేదా ప‌ర్మ‌నెంట్ రెసిడెన్సీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి అప్లికేష‌న్ల‌ను ఆరు నెల‌ల్లోగా క్లియ‌ర్ చేయాల‌ని అమెరికా అధ్య‌క్ష స‌ల‌హా మండ‌లి ఏక‌గ్రీవంగా తీర్మానించింది.ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సిఫారసు చేయనుంది. ఈ సిఫారసుకు అధ్యక్షుడి ఆమోదం లభిస్తే.. అమెరికాలో శాశ్వత నివాస హోదాను కల్పించే గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న భారతీయ అమెరికన్లకు మోక్షం లభించినట్టే అవుతుంది. భార‌తీయ అమెరిక‌న్ నేత అజ‌య్ జైన్ భుటోరియా నేతృత్వంలోని బృందం ఈ ప్ర‌తిపాద‌న చేసింది. ఆ ప్ర‌తిపాద‌న‌కు 25 మంది క‌మీష‌న‌ర్లు ఏక‌గ్రీవంగా ఆమోదించారు.ప్రతీ దేశానికి ఏడు శాతం కోటా పరిమితి విధించారు. దీంతో చాలా మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం చాన్నాళ్లుగా వేచి చూస్తున్నారు.