
టిఎస్‌ఎస్‌పిడిసిఎల్(దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ)లో తొలిసారిగా మహిళలను లైన్ ఉమెన్‌గా తీసుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తొలి లైన్ ఉమన్‌గా శిరీష అనే యువతి రికార్డులకెక్కింది. ఆమెను మేడ్చల్ సర్కిల్ పరిధిలో జేఎల్‌ఎంగా నియమించారు. నియామక పత్రాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఆమెకు అందజేశారు. 200పై చిలుకు లైన్ ఉమెన్‌లను ట్రాన్స్‌కో సంస్థ ఉద్యోగంలోకి తీసుకుందని మంత్రి తెలిపారు. దేశ చరిత్రలో లైన్ ఉమెన్‌గా ఉద్యోగం ఇచ్చిన సంస్థగా టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ నిలుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా మహిళలను ఈ పోస్టుల్లో నియమించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందని చెప్పారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




