రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభించిన కేసీఆర్
admin November 15, 2022 0 COMMENTS
రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ఏడు మెడికల్ కాలేజీకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభోత్సవం చేశారు.
మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి మెడికల్ కాలేజీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.గతంలో 850 సీట్లు ఉండేవి.. ఇప్పుడు 2,790 సీట్లకు పెరిగాయని అన్నారు. ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. 33 జిల్లాల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీలను నిర్మిస్తామని వెల్లడించారు. ఒకనాడు అనేక సమస్యలతో తాగు, సాగునీటికి, కరెంటు, మెడికల్ సీట్లు, ఇంజినీరింగ్ సీట్లకు ఎన్నో రకాల అవస్థలుపడ్డ తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రమై అద్భుతంగా ఆత్మగౌరవంతో బతుకుతూ దేశానికే మార్గదర్శకమైనటువంటి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాం.




