Friday, 23 October 2026
పర్యావరణం · October 9, 2021 · admin

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం

జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని, నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.అత్యవసర పరిస్థితుల్లో టోల్‌ ఫ్రీ నంబర్‌ 040-21111111కు ఫోన్‌లో సంప్రదించవచ్చని తెలిపింది. కాగా, శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికే నగరం అతలాకుతలమైంది.నిన్న సాయంత్రం జంట నగరాలను అల్లాడించింది.