
సాహిత్యంలో ఈ ఏడాదికి గాను టాంజేనియా నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాను నోబెల్ పురస్కారం లభించింది.1948లో హిందూ మహాసముద్రంలోని జాంజిబర్ ద్వీపంలో జన్మించారు. కానీ 1960 చివర్లో శరణార్థిగా ఇంగ్లాండ్ వలసవెళ్లారు. సామ్రాజ్య, వలస వాదంపై ఆయన చేసిన పోరాటం, గల్ఫ్ దేశాల్లో శరణార్థుల స్థితిగతులను కళ్లకు గట్టినట్టు తన రచనల్లో పొందుపరిచినందుకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఎంపిక చేసినట్లు నోబెల్ జ్యూరీ ప్రకటించింది.ఆయన మొదటి నవల మెమొరీ ఆఫ్ డిపార్చర్ 1987లో విడుదలైంది. ఈయన రాసిన ‘ప్యారడైజ్’ (1994) నవలకు గాను ఈ బహుమతి ప్రదానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఆయన రాసిన నాల్గవ నవల. తూర్పు ఆఫ్రికాలో 1990లో నెలకొని ఉన్న పరిస్థితులకు సంబంధించి ఒక పరిశోధన యాత్ర నుంచి ఈ నవల ఉద్భవించింది.ఇక, చిన్నకథల విషయానికి వస్తే.. 2006లో ‘మై మదర్ లివ్డ్ ఆన్ ఏ ఫామ్ ఇన్ ఆఫ్రికా’, 2016లో ‘ద అరైవర్స్ టేల్’, 2019లో ‘ద స్టేట్‌లెస్ పర్సన్స్ టేల్’ అనే మూడు షార్ట్ స్టోరీస్ ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఆయన కేంట్రబెరీలోని కెంట్ యూనివర్శిటీలో సాహిత్య ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
RELATED ARTICLES




