
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడంతోపాటు 144 సెక్షన్ విధించారు. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కొనసాగుతున్నారు.టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ లో 1,695 ఓట్ల మెజారిటీ పొందారు. మొత్తంగా ఈటలకు 2,958 ఓట్ల ఆధిక్యం లభించింది. నాలుగు రౌండ్లు కలిపి ఈటలకు 17,838 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 16,134 ఓట్లు వచ్చాయి.
RELATED ARTICLES
LEAVE A COMMENT




