కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే
admin October 26, 2022 0 COMMENTS
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలి ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆయన ప్రత్యర్థి శశిథరూర్ పై గెలవడం తెలిసిందే. 130 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఆరు సార్లు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం అధికారికంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి మధుసూదన మిస్త్రి నుంచి ఖర్గే సర్టిఫికెట్ అందుకున్నారు. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




