
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్మేయడంతో వాతావరణం చల్లబడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, కూకట్పల్లి, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, బషీర్బాగ్, అమీర్పేట, తర్నాక, చింతల్బస్తి, సోమాజిగూడ, నాంపల్లి, లక్డీకపూల్, కోఠిలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఈ నెల 3,4 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలతో చెరువులు, కుంటలు ఇప్పటీకే నిండు కుండలను తలపిస్తుండడంతో మళ్లీ వర్షం కురువడంతో పరిసర ప్రాంతాల వాసులు ఎక్కడినుంచి ఏ క్షణంలో వరద ముంచుకువస్తోందని భయాందోళనలకు గురవుతున్నారు. వర్షం తగ్గేసారికి హైదరాబాద్ నగరవాసులు మరియి లోతట్టు ప్రాంతాలవారు రీలిపయ్యారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




