
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి (Mana uru-Mana badi) అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ… 1వ తరగతి నుండి 8 వ తరగతి వరకు వచ్చే సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే టీచర్‌లకు కూడా శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లను ధీటుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో 3,000 స్కూళ్ళు అభివృద్ధి చేస్తామన్నారు. సెలవుల రోజులలోనే త్వరితగతిన స్కూళ్ల రంగులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని బాగు చేస్తామని తెలిపారు. జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ఆయా జిల్లాలో ఉన్న స్కూళ్లను పర్యవేక్షణ చేయాలని సూచించారు.
RELATED ARTICLES




